బాలయ్యకు విలన్‌గా రోజా..?

713
balayya
- Advertisement -

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలో ఓ కొత్త సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల మాదిరిగానే మూడో చిత్రం కూడా ఫ్యామిలీ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనుంది. బాలయ్యకు ఇది 106వ సినిమా. అయితే ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్‌ రోల్ కోసం రోజాను అడిగినట్లు ప్రచారం జరుగుతుంది.

Roja

బోయపాటి సినిమాలో విలన్ పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తన కొత్త చిత్రంలో మహిళను పవర్‌ఫుల్ విలన్ పాత్రలో చూపించబోతున్నారట. ఆ పాత్ర కోసం చాలా మందిని పరిశీలించి చివరికి రోజాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించలేదు.

బాలయ్య, రోజా ఇదివరకే చాలా సినిమాల్లో హీరోహీరోయిన్లుగా కలిసి నటించి సూపర్‌హిట్లు అందుకున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ కూడా నటిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

- Advertisement -