సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు..

257
kcr
- Advertisement -

పంచాయతీ రాజ్, గ్రామీణభివృద్ధి శాఖ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్ రావుని కలిసి తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డ్ వచ్చినందుకు అట్టి అవార్డ్ రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ అవార్డు రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాలు మరియు సూచనలు మాత్రమే అని అన్నారు మంత్రి దయాకర్ రావు. వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ గ్రామీణాభివృద్ధి కొరకు నిరంతర కృషి సలిపిన అధికారులకు, ప్రజా ప్రతినిధులకు అందరికి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -