‘తేజ్‌’ యాప్‌ని మార్చేశారు..

201
Google Tez
- Advertisement -

‘తేజ్‌’ యాప్ పేరు మారింది. గతేడాది గూగుల్‌ రూపొందించిన ఈ యాప్‌ సెప్టెంబర్‌ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఆ యాప్‌కి రూపొందించి ఏడాది గడవడంతో ‘తేజ్‌’ ని కాస్తా..’గూగుల్‌ పే’ గా మార్చినట్లు ఆ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది.

 Google Tez

కొత్త గూగుల్‌ పే యాప్‌ తో ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్‌ సులువుగా చేసుకోవడంతో పాటు బుక్ మై షో, గోఐబిబో, రెడ్‌బస్‌ లాంటి వాటిలో టికెట్ లు సులువుగా బుక్ చేసుకునే వీలు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌ లతో గూగుల్ పే అనుసంధానం కావడంతో వినియోగాదారులు రుణాలు కూడా పొందే అవకాశం ఉందని గూగుల్ పే అధికారి సేన్‌గుప్తా తెలిపారు.

కాగా…పేమెంట్ మోడ్ తో మొట్టమొదటిసారి ఇండియాలో గూగుల్ ప్రవేశపెట్టగా, ఈ ఏడాది కాలంలో రూ.2 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయని కంపెనీ తెలిపింది.

- Advertisement -