ఈ ఇద్దరు 2027 వరల్డ్ కప్‌ లో కష్టమే?

138
- Advertisement -

గత 50 రోజులుగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన వన్డే వరల్డ్ కప్ ముగిసింది. ఆరోసారి ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ సొంతం చేసుకోగా.. టీమిండియా రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇక ఈ వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాళ్లు చాంపియన్సేనని అభిమానులు కొనియాడుతున్నారు. కాగా ప్రస్తుతం కప్పు చేజారిపోయినప్పటికి నెక్స్ట్ వరల్డ్ కప్ కోసం సిద్ధమవ్వాల అభిమానులు కోరుకుంటున్నారు. అయితే 2027లో జరిగే వరల్డ్ కప్ కు టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండే అవకాశాలు చాలా తక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 సంవత్సరాలు.. 2027 నాటికి 40లోకి అడుగు పెడతాడు. ఆ వయసులో ఫిట్ నెస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. .

అందువల్ల రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యం లేదని కొందరి అభిప్రాయం. ఇక రన్ మిషన్ విరాట్ కోహ్లీ విషయానికొస్తే.. ఫిట్ నెస్ పరంగా స్ట్రాంగ్ గానే ఉన్నప్పటికీ వయసు రీత్య కోహ్లీ కూడా 39 లోకి ఎంట్రీ అవుతాడు. అందువల్ల పరిస్థితులను బట్టి కోహ్లీ కూడా సంచలన నిర్ణయం ( రిటైర్మెంట్ విషయంలో ) తీసుకున్న ఆశ్చర్యం లేదనేది కొందరు విశ్లేషకులు చెప్పే మాట. ఒకవేళ ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఈ ఇద్దరి స్థానాలను భర్తీ చేసే ఆటగాళ్లు టీమిండియాలో లేరని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గిల్, కే‌ఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు రాణిస్తున్నప్పటికి కోహ్లీ, రోహిత్ స్థానాలను చేరుకోవడానికి చాలానే సమయం పడుతుంది. అందువల్ల రోహిత్, కోహ్లీ.. జట్టుకు బై బై చెబితే టీమిండియా క్రికెట్ బలం తగ్గుతుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఇద్దరు దగ్గర ఆటగాళ్లు వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారో లేదో చూడాలి.

Also Read:Congress:కాంగ్రెస్ ఆ లొల్లి నిజమేనా?

- Advertisement -