రోహిత్ vs పాండ్య.. ముదురుతున్న వివాదం!

45
- Advertisement -

ఐపీఎల్ కు ముందు ముంబై ఇండియన్స్ పై రోజు రోజుకు నెగిటివిటీ పెరుగుతోంది. రోహిత్ శర్మ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత మొదలైన వివాదం ఇప్పటికీ కూడా రగులుకుంటూనే ఉంది. కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కు నాలుగు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారనే దానిపై ఇప్పటికీ కూడా ముంబై ఇండియన్స్ యజమాన్యం సరైన వివరణ ఇవ్వలేదు. దాంతో రోహిత్ ఫ్యాన్స్ యజమాన్యంపై ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉన్నారు. ఇక ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో రోహిత్ కెప్టెన్సీపై ఎదురైన ప్రశ్నను హెడ్ కోచ్ మరియు కెప్టెన్ హర్ధిక్ పాండ్య దాటవేసే ప్రయత్నం చేశారు. రోహిత్ ను ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పించారని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు పాండ్య. .ఈ వ్యవహారం రోహిత్ శర్మ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో హర్ధిక్ పాండ్య కు వ్యతిరేకంగా ‘రిప్ హర్ధిక్ పాండ్య ‘ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఈ స్థాయి వివాదంలో చిక్కుకున్న ముంబై ఇండియన్స్ లీగ్ ప్రారంభం అయిన తరువాత ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది. పాండ్య అట్టిట్యూడ్ చూపిస్తాడని, ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడని అప్పుడప్పుడు విమర్శలు వెలువడుతూనే ఉంటాయి. మరి అలాంటి పాండ్య కెప్టెన్సీ లో రోహిత్ ఎలా ఆడతాదనేది క్యూరియాసిటీని పెంచుతున్న అంశం. ఈ నేపథ్యంలో రోహిత్ మరియు పాండ్య మద్య సమన్వయం కొరవడితే ముంబై జట్టు మరిన్ని విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి మొదటిసారి పాండ్య కెప్టెన్సీలో బరిలోకి దిగుతున్న ముంబై ఈ సీజన్ లో ఎలా రాణిస్తుందో చూడాలి.. ముంబై మొదటి మ్యాచ్ ఈ నెల 23 న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది.

Also Read:మహేష్‌తో మూవీ త్వరలో ప్రారంభం!

- Advertisement -