టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. మెల్లగా జట్టుకు దురమౌతున్నదని, త్వరలోనే రోహిత్ అంతర్జాతీయ టోర్నీల కు గుడ్ పై చెబుతాడాని ఇలా రకరకాల వార్తలు గత కొన్నాళ్లుగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. కానీ అన్నీ మ్యాచుల్లోనూ విజయం సాధించిన టీమిండియా ఫైనల్ లో మాత్రం ఓటమి చవిచూసింది. దీంతో ఈ వరల్డ్ కప్ తరువాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు హిట్ మ్యాన్ అందుబాటులో ఉంటాడా లేదా అనే డౌట్ చాలామందిలో ఉంది. .
2019 టీ20 వరల్డ్ కప్ తరువాత రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు ( ఐపీఎల్ మినహా ) దాంతో రోహిత్ శర్మ టీ20 లకు గుడ్ బై చెబుతాడానే టాక్ గట్టిగానే వినిపిస్తూ వచ్చింది. వరల్డ్ కప్ తరువాత ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కు కూడా రోహిత్ శర్మ దూరంగానే ఉన్నాడు. ఇక ఆ తరువాత సౌతాఫ్రికా టూర్ కు కూడా రోహిత్ దూరంగానే ఉండాలని భావిస్తున్నారట. దీంతో బీసీసీఐ రోహిత్ శర్మకు రిక్వస్ట్ పంపినట్లు క్రీడా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 మ్యాచ్ లకు కెప్టెన్ గా రోహిత్ శర్మనే వ్యవహరించాలని బీసీసీఐ కోరినట్లు సమాచారం. సౌతాఫ్రికా తో మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు అడనుంది టీమిండియా. ఇక పోతే రోహిత్ శర్మ ఐపీఎల్ పట్ల కూడా ఆసక్తిగా లేరని వినికిడి.. ఇప్పటికే ముంబై ఇండియన్స్ జట్టులోకి హర్ధిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇచ్చాడు. దాంతో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ ని కూడా వదులుకొనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ప్లీజ్ కాం బ్యాక్ రోహిత్ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి హిట్ మ్యాన్ ఎలా వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అనేది చూడాలి.
Also Read:ఓటేసిన బన్నీ,ఎన్టీఆర్,కవిత