- Advertisement -
వరల్డ్ కప్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాడు టీంఇండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. ఈ టోర్నిలో మొత్తం 9మ్యాచ్ లు ఆడిన రోహిత్ ఐదు సెంచరీలతో రికార్డు సృష్టించాడు. ఇక ఈటోర్నిలో అత్యధిక స్కోరు 648 పరుగులు చేసి మొదటి స్ధానంలో నిలిచాడు. ఈసందర్భంగా రోహిత్ శర్మ ఐసీసీ గెల్డెన్ బ్యాట్ ను దక్కించుకున్నాడు.
ప్రతి ఏడాది అత్యధిక స్కోరు చేసిన వారికి ఈ అవార్డును ఇస్తుంది ఐసీసీ. ఈసారి రోహిత్ శర్మ గోల్డెన్ బ్యాట్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ కప్ టోర్నీలో గోల్డెన్ బ్యాట్ అందుకున్న మూడో భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఇండియా తరపున ఇంతకుమందు ఈ అవార్డు సచిన్ టెండూల్కర్ రెండు సార్లు అందుకోగా, రాహుల్ ద్రావిడ్ ఒకసారి ఈ గోల్డెన్ బ్యాట్ అవార్డును అందుకున్నారు.
- Advertisement -