దక్షిణాఫ్రికా వేదికగా 2020 జనవరిలో అండర్ – 19 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువ క్రికెటర్లకు విషెస్ చెబుతూనే పలు సూచనలు చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.
భారత ఆటగాళ్లు వరల్డ్‌కప్‌తో తిరిగి రావాలని ఆకాంక్షించిన రోహిత్ ఒత్తిడిని అధిగమిస్తే అది సాధ్యమేనని చెప్పారు. ఆటగాళ్లకు తమ సహజ సిద్ధమైన ఆటతో ఆడే స్వేచ్ఛ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు విన్నవిస్తూనే మేనేజ్‌మెంట్ తమ విధిగా ఆటగాళ్లపై ఒత్తిడి లేకుండా గుర్తించాలన్నారు.
భారీ షాట్లు ఆడటం క్రైమ్ కాదు…కవర్ డ్రైవర్‌లతో పాటు భారీ షాట్లను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలన్నారు. భారీ షాట్లు ఆడే క్రమంలో ఆటగాళ్లు ఏమైనా తప్పులు చేస్తే వాటిని సరి చేయండి కానీ సహజసిద్ధమైన షాట్లను ఆడొద్దని నివారించకండని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. ఒక ఆటగాడు భారీ షాట్లతో ఫలితాలు రాబడుతున్నప్పుడు అందులో తప్పేముంటుందన్నారు.
జనవరి 17వ తేదీ నుంచి అండర్-19 వరల్డ్‌కప్ ఆరంభం కానుండగా భారత్ గ్రూప్-ఏలో ఉంది. ఇక జనవరి 19న తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది భారత్.