ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది రోహిత్ సేన. కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడంలో వందశాతం సక్సెస్ సాధించాడు రోహిత్ శర్మ. ఈ నేపథ్యంలో రోహిత్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు మాజీ క్రికెటర్లు. కోహ్లీ లేకపోయినా జట్టును రోహిత్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడని కొనియాడారు పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్.
పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత అజేయ శతకంతో రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడని చెప్సారు. కెప్టెన్‌గా రోహిత్ బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నాడని…సులభంగా పరుగులు రాబడుతున్నాడని చెప్పారు. ధావన్ కూడా రోహిత్‌కు చక్కని సహకారం అందిస్తున్నాడని చెప్పారు.
కోహ్లీ అందుబాటులో లేని సమయంలో రోహిత్‌కు ఆ బాధ్యతలు అప్పగించడం మంచిదని తాను అనుకుంటున్నట్లు అతని కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ జట్టులో ఆడిన హర్భజన్ సింగ్ కూడా అన్నాడు.
మరోవైపు భారత్ చేతిలో రెండుసార్లు ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు పాక్ ఫ్యాన్స్. కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. తప్పుడు నిర్ణయాలతో జట్టు ఓటమికి కారణమయ్యాడని మండిపడుతున్నారు.