అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ

237
SK Joshi
- Advertisement -

తెలంగాణ ముఖచిత్రం ప్రతిబింబించేలా బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్నారు. బతుకమ్మ సంబరాలపై రివ్యూ నిర్వహించిన జోషి..బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

అక్టోబర్ 9 నుంచి 17 వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని..17న సద్దుల బతుకమ్మ పండగను హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో వైభవంగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ
కమిషనర్లు, సీపీలు హాజరయ్యారు.

మరోవైపు బతుకమ్మ పండుగ సందర్భంగా పంపిణీ చేయనున్న చీరలు ఇప్పటికే హైదరాబాద్ సహా.. జిల్లాలకు చేరుకున్నాయి. గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది.

- Advertisement -