రోహిత్ వరల్డ్ రికార్డ్…భార్యకు ఫ్లయింగ్‌ కిస్‌..!

573
Rohit Sharma scores record third ODI double century
- Advertisement -

మొహాలీలో శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ దెబ్బకు లంక ఆటగాళ్లు కళ్లు తేలేశారు. సిక్సర్లను ఇంత అలవోకగా కూడా కొట్టొచ్చా? అనే రీతిలో రోహిత్ రెచ్చిపోయాడు. ఈ క్రమంలో రోహిత్ డబుల్ సెంచరీ కొట్టాడు. తొలి వన్డే గెలుపుతో విర్రవీగిన శ్రీలంక బౌలర్లని కనికరం లేకుండా కెప్టెన్ రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13×4, 12×6) డబుల్ సెంచరీతో తొలుత ఉతికారేయగా.. అనంతరం బౌలర్లు ఆ జట్టు బ్యాట్స్‌మెన్ల పనిపట్టారు.

 Rohit Sharma scores record third ODI double century

దీంతో మొహాలి వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 141 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్ మూడు వన్డేల సిరీస్‌ని 1-1తో సమం చేసి.. సిరీస్‌ ఆశలు నిలుపుకుంది. ఇక విజేత నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనుంది. జట్టులో రోహిత్ శర్మతో పాటు శ్రేయాస్ అయ్యర్ (88: 70 బంతుల్లో 9×4, 2×6), శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలు సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక 251/8కే పరిమితమైంది.

రోహిత్ శర్మ విధ్వంసంతో భారత్ ఇన్నింగ్స్‌ ముగిసే సరికే మానసికంగా కుంగిపోయిన శ్రీలంక జట్టు 393 పరుగుల భారీ లక్ష్య ఛేదన‌లో ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆ జట్టులో మాజీ కెప్టెన్ మాథ్యూస్ (111 నాటౌట్: 132 బంతుల్లో 9×4, 3×6) ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకారం అందించేవారు కరవయ్యారు. భారత్ బౌలర్లు చాహల్ (3/60), బుమ్రా (2/43) ధాటికి ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. గుణతిలక (16), ఉపుల్ తరంగ (7), తిరుమానె (21) జట్టు స్కోరు 100 దాటే లోపే పెవిలియన్ చేరిపోగా.. డిక్విల్లా (22), కెప్టెన్ తిసార పెరీరా (5) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని జట్టుని మరింత ఒత్తిడిలోకి నెట్టేశారు.

 Rohit Sharma scores record third ODI double century

ఇదిలా ఉండగా …రోహిత్‌ తన భార్య రితికకు బుధవారం తమ వివా హ వార్షికోత్సవం సందర్భం గా చిరస్మరణీయ కానుకను ఇచ్చాడు. ఈ మ్యాచ్‌కు హాజ రైన భార్యకు ‘డబుల్‌’ బహు మతినే ఇచ్చాడు. చివరి ఓ వర్‌లో ద్విశతకానికి 9 పరుగు లు కావాల్సి ఉండగా కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే మూడు బంతుల్లోనే ఓ సిక్సర్‌ సహాయంతో ఈ రికార్డు ఫీట్‌ను అందుకున్నాడు. తన భర్త ప్రపంచ రికార్డును చూ సి తీవ్ర భావోద్వేగానికి గురైన రితిక.. ఆనంద భాష్పాలతో కనిపించగా విజయగర్వంతో రోహిత్‌ తన శ్రీమతికి ఓ ఫ్లయింగ్‌ కిస్‌ విసిరాడు.

 Rohit Sharma scores record third ODI double century

.

 Rohit Sharma scores record third ODI double century

.

- Advertisement -