కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిదహాస్ ట్రోఫి ఫైనల్లో కీపర్ దినేశ్ కార్తీక్ (29: 8 బంతుల్లో 2×4, 3×6) సంచలన ఇన్నింగ్స్‌తో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. గెలుపుపై ఆశలు లేని స్థితిలో క్రీజులోకి వచ్చిన దినేష్..టీమిండియాకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు.
దీంతో కొంతకాలంగా తన ఆటతీరుపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. చివరి బంతికి కార్తీక్ కొట్టిన సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ సూపర్ సిక్స్‌ను కెప్టెన్ రోహిత్ మాత్రం మిస్సయ్యాడట.
లాస్ట్ బంతికి ఐదు పరుగులు కావాలి..స్ట్రైకింగ్‌లో కార్తీక్ ఉన్నాడు..ఎలాగూ ఫోర్ కొడతాడని అనుకున్నానని సూపర్ ఓవర్ ఆడాల్సివస్తుందని డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లి ఫ్యాడ్‌లు కట్టుకుంటున్నాని అందుకే ఆ సిక్స్‌ని చూడలేకపోయానని తెలిపాడు రోహిత్.
ఇక బ్యాటింగ్ ఆర్డర్లో మార్పుపై క్లారిటీ ఇచ్చాడు రోహిత్. అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేని విజయ్ శంకర్…కార్తీక్ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి వరుస బంతుల్ని వృథా చేశాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో నాలుగు బంతుల్లో ఒక్కపరుగు చేయలేదు. దీంతో భారత్ దాదాపుగా ఓటమికి చేరువైంది. ఈ నేపథ్యంలో స్పందించిన రోహిత్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ డెత్ ఓవర్లలో విజయ్ ఆరోస్థానంలో బ్యాటింగ్ చేస్తుంటాడు..కొన్ని భిన్నమైన షాట్లు బాగా ఆడగలడు అందుకే దినేశ్ కార్తీక్‌ని కూర్చొబెట్టి అతడ్ని బ్యాటింగ్‌కి పంపించామని తెలిపాడు.