భారీ రేటుకు రజనీ ‘కాలా’..

243
- Advertisement -

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. రజనీ సినిమా రీలీజ్‌ అయిదంటే చాలు ఫ్యాన్‌కి పండగే. అలాంటి సూపర్‌స్టార్‌ తాజా చిత్రం ‘కాలా’. ఈ సినిమా వచ్చే నేలలో విడుదలకు సిద్దంగా ఉంది. కబాలి సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ రంజిత్ పా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

Kaala' satellite rights sold for Rs 75 cr!

అయితే ఎప్పటినుండో రజనీతో సినిమా తీయాలని ఎంతో మంది పెద్ద దర్శకులు ఎదురు చూస్తున్నా.. వారికి కాకుండా కాలాతో రంజిత్ పాకు మరో అవకాశం ఇవ్వడం విశేషం. గత సినిమా ‘కబాలి’లో డాన్‌ పాత్ర పోషించిన తలైవా ఈ సినిమాలో కూడా డాన్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో రజనీ లుక్ .. అభిమానులలో ఒక రేంజ్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రజనీ అల్లుడు ధనుష్ నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ హక్కులను లైకా ప్రొడక్షన్స్ వారు 125 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు భారీస్థాయిలో పోటీ ఏర్పడిందట. కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి కాలా శాటిలైట్ హక్కులను తెలుగు – తమిళ్ – హింది మూడు బాషలకు కలిపి హోల్ సేల్ గా 75 కోట్లకు స్టార్ టీవీ వారు దక్కించుకున్నట్టు తాజా సమాచారం. ఏప్రిల్ 27వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.

- Advertisement -