ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్‌సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో రోహిత్ ‘రిటైర్డ్ హర్ట్’గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. స్కానింగ్‌లో పెద్ద గాయం లేదని తేలినప్పటికీ, సుదీర్ఘ సీజన్ దృష్ట్యా ముంబై యాజమాన్యం రోహిత్ విషయంలో రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.
ఒకవేళ రోహిత్ అందుబాటులో లేకపోతే, ర్యాన్ రికెల్టన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించగల ముగ్గురు ప్రధాన ఆటగాళ్లు వీరే.రోహిత్ స్థానానికి డి కాక్ అత్యుత్తమ ప్రత్యామ్నాయం. అయితే, ఇతనిని జట్టులోకి తీసుకోవాలంటే విదేశీ ఆటగాళ్ల కోటాలో షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మిచెల్ సాంట్నర్ లేదా ట్రెంట్ బౌల్ట్‌లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. సాంట్నర్, బౌల్ట్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో, వారి స్థానంలో ఒక భారతీయ బౌలర్‌ను తీసుకుని డి కాక్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
విదర్భకు చెందిన ఈ 22 ఏళ్ల కుర్రాడు రోహిత్ స్థానంలో ‘స్ట్రెయిట్ స్వాప్’ (నేరుగా మార్పు) అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రాణిస్తున్న మలేవార్, విదర్భ ప్రో టీ20 లీగ్‌లో కేవలం 55 బంతుల్లోనే 120 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇతనిని తీసుకోవడం వల్ల జట్టు కూర్పులో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు.
Also Read:దక్షిణాదికి అన్యాయం జరగకూడదు:గుత్తా
గత సీజన్‌లో ముంబై తరపున ఆడిన మింజ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, పవర్‌ప్లేలో భారీ షాట్లు ఆడగల సామర్థ్యం అతనికి ఉంది. టీ20ల్లో 155.19 స్ట్రైక్ రేట్‌తో ఉన్న ఇతనికి ఓపెనర్‌గా అవకాశం ఇస్తే ముంబైకి కలిసొచ్చే అవకాశం ఉంది.
వీరు కాకుండా నమన్ ధీర్ ను ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది. విల్ జాక్స్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ముంబై మేనేజ్‌మెంట్ పైన పేర్కొన్న ముగ్గురిలో ఒకరిని ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.

