వరల్డ్ కప్ ముందు భారత్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఐపిఎల్ ప్రాక్టీస్ లో భాగంగా ఫిల్డింగ్ చేస్తూ డ్రైవ్ చేశాడు రోహిత్. దీంతో కుడి కాలు కండరాలు పట్టేయడంతో రోహిత్ శర్మ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఫిజియో నితిన్ పటేల్ సహయంతో అతి కష్టం మీద మైదానం నుంచి బయటకు వెళ్లాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మకు గాయం చాలా పెద్దదే అన్నట్టు సమాచారం. కోలుకోవడానికి కనీసం 2 నుంచి 6 వారాలు పడుతుందని ఫిజియోలు వెల్లడించారు.
అయితే ప్రపంచకప్ లోపు రోహిత్ కోలుకునే అవకాశాలున్నాయని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈరోజు పంజాబ్‌పై మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. తొడ కండరాల గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. కోలుకుని మళ్లీ ఫిట్‌నెస్ సాధించేందుకు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. సెలక్టర్లు 15 మందితో కూడిన భారత్ జట్టుని ఈనెల 15న(సోమవారం) ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయపడిన వార్త.. టీమిండియా, సెలక్టర్ల ఆందోళనని పెంచుతోంది. ఓపెనర్‌గానే కాకుండా.. జట్టు వైస్ కెప్టెన్‌గానూ రోహిత్ శర్మ ప్రపంచకప్‌కి ఎంపికవ్వనున్నాడు.