రోహిత్ శ‌ర్మ అర్ధ సెంచ‌రీ..

187
Rohit Sharma
- Advertisement -

సిడ్నీలో ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు మ్యాచ్ జరుగుతోంది. భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ శుభ్‌మన్ గిల్‌( 31) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. 407 ప‌రుగుల టార్గె‌ట్‌ని ఆసీస్ నిర్ధేశించ‌గా రోహిత్ శ‌ర్మ‌( 52), శుభ్‌మ‌న్ గిల్‌లు చాలా ఏకాగ్ర‌త‌తో ఆడుతూ వ‌చ్చారు. అయితే భార‌త్ స్కోరు 71 ప‌రుగుల వ‌ద్ద హాజిల్‌వుడ్ వేసిన బంతికి కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు శుభ్‌మ‌న్. ప్ర‌స్తుతం క్రీజులో రోహిత్‌తో పాటు పుజారా(8) ఉన్నారు. అయితే ఓవ‌ర్సీస్‌లో ఓపెన‌ర్‌గా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శ‌ర్మ అర్ధ సెంచ‌రీ చేయ‌డం విశేషం.

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా జ‌ట్టు 312 ప‌రుగుల‌కు డిక్లేర్ చేసింది. వార్నర్ (13), పకోవ్‌స్కీ ( 10) వెంట‌వెంట‌నే ఔట‌యిన‌ప్ప‌టికీ స్మిత్‌( 81), ల‌బుషేన్ (73) అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాని ప‌టిష్ట స్థితిలో నిలిపారు. చివ‌ర‌లో ఆల్‌రౌండ‌ర్ గ్రీన్(84), కెప్టెన్ టిమ్ పైన్(39) బౌండరీల‌తో రెచ్చిపోయారు. దీంతో స్కోర్ బోర్డ్ వేగంగా ప‌రుగెత్తింది.

- Advertisement -