ఐపీఎల్లో అత్యధికంగా చాంపియన్‌గా నిలిచిన జట్టు ముంబై ఇండియన్స్. మూడు సార్లు చాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్ ఐసీఎల్‌లో మాత్రం వరుస ఓటములతో సతమతమవుతుంది. ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.
ఓటములతో చతికిలబడ్డ ముంబైకి మాజీ క్రికెటర్ ఓ సలహా ఇచ్చాడు. ఈ జట్టు విజయాల బాట పట్టాలంటే ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ రావాలని మాజీ క్రికెటర్ లాల్‌చంద్ రాజ్‌పుత్ అభిప్రాయపడ్డారు. రోహిత్ నాలుగో స్థానంలో రావడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారని.. అందువల్ల స్వేచ్చగా ఆడలేకపోతున్నారన్నారు. ఓపెనర్‌గా వస్తే ఒత్తిడి లేకుండా భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
ముంబై జట్టులోను కొన్ని మార్పులు చేర్పులు చేయాలన్నారు. ఫామ్‌లో లేని పోలార్డ్‌కి బదులు సౌతాఫ్రికా ఆటగాడు జేపీ డుమినిని తీసుకోవాలని సూచించాడు. పొలార్డ్ పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నాడు. అందుకే అతని స్థానంలో డుమినిని తీసుకోవడం మంచిదన్నారు. ఇక రేపు పుణె వేదికగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడనుంది ముంబై ఇండియన్స్. ఇప్పటికే ఈ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉంది.