భారతీయుడు 2.. కమల్‌ న్యూ లుక్‌..

363
- Advertisement -

శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘భారతీయుడు’. ఈ చిత్రంలో కమల్‌ సేనాపతిగా నటించిచారు. ఈ పాత్ర చూసిన వారెవరికైనా మరిచిపోలేరు. లంచగొండి తనంపై పోరాడే స్వాతంత్ర్య సమరయోధుడిగా కమల్ నటన అద్భుతంగా సాగిందా చిత్రంలో. ఇక, తాజాగా ఆ సినిమాకు కొనసాగింపుగా భారతీయుడు-2 తీస్తున్న శంకర్, అందులోని సేనాపతి పాత్రకు సంబంధించిన స్పెషల్ లుక్ ను విడుదల చేశారు. ఎత్తుగా కనిపిస్తున్న ఓ కోటపై నిలబడివున్న కమల్ ఇందులో కనిపిస్తుండగా,ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. తొలి భాగంలోని డ్రస్సింగ్ స్టయిలే ఇందులోనూ కనిపిస్తోంది.

ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. దాదాపు రూ.180 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న భారతీయుడు 2 సినిమాని తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో కమల్‌హాసన్‌కి జోడీగా కాజల్ న‌టించ‌నున్నారు. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భ‌వానీ శంక‌ర్, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రల‌లో, అజయ్‌ దేవ్‌గణ్‌ నెగటివ్‌ పాత్రలో నటిస్తారని సమాచారం . లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అనిరుధ్ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు.

kamal-new-look

- Advertisement -