సోదరుడిని మాత్రమే వదులుకున్నా!

6
- Advertisement -

కుటుంబంలో వివాదాంపై స్పందించారు లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తన సోదరుడిని (తేజస్వి యాదవ్) మాత్రమే వదులుకున్నానని, తన తల్లిదండ్రులు, ముఖ్యంగా తన తండ్రి ఎప్పుడూ తనకు అండగా నిలిచారని ఆమె తెలిపారు. బీహార్‌లో జరిగిన 2025 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (RJD) దారుణంగా ఓడిపోయిన మరుసటి రోజు రోహిణి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆమె…తన తల్లిదండ్రులు, సోదరీమణులు తనకు మద్దతు ఇస్తున్నారని ధృవీకరించారు. వృత్తిరీత్యా వైద్యురాలైన రోహిణి ఆచార్య, తన అత్తమామలు ఉండే ముంబైకి వెళ్తున్నానని, తన అత్తగారు తన గురించి ‘తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని’ చెప్పారు.

“నేను చెప్పాలనుకున్నదంతా నా సోషల్ మీడియాలో చెప్పాను… జరిగిన దాని గురించి నేను అబద్ధం చెప్పలేదు… మీరు వెళ్లి తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్, రేచెల్ యాదవ్, రమీజ్‌లను అడగవచ్చు… నా తండ్రి ఎప్పుడూ నా పక్కనే ఉన్నారు అని రోహిణి అన్నారు.

నిన్న నా తల్లిదండ్రులు, సోదరీమణులు నా కోసం ఏడ్చారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు నేను ధన్యురాలిని… కుటుంబంలో సోదరులు ఉన్నప్పుడు, వారే కుటుంబం కోసం త్యాగాలు చేయాలి… నేను నా సోదరుడిని మాత్రమే వదులుకున్నాను. నా తల్లిదండ్రులు, సోదరీమణులు నాతోనే ఉన్నారు అని ఆమె తెలిపారు.

తేజస్వి సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్‌ల వల్లే తాను రాజకీయాలను వీడాల్సి వచ్చిందని, తనను “అనాథను” చేశారని ఆచార్య ఆరోపించారు. కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లో తన తండ్రికి కిడ్నీ మార్పిడి సమయంలో భర్త .. అత్తమామల అనుమతి తీసుకోకుండా కిడ్నీ దానం చేయడం ద్వారా తాను ‘ఘోరమైన పాపం’ చేశానని ఆమె పేర్కొన్నారు.

అయితే తేజ్ ప్రతాప్… రోహిణికి మద్దతుగా నిలిచారు, తన సోదరిని అవమానిస్తే సహించేది లేదని అన్నారు. 2015 మరియు 2020 ఎన్నికల తర్వాత బీహార్‌లో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినా, ప్రస్తుతం దాని బలం కేవలం 25 సీట్లకు తగ్గింది.

Also Read:రజనీ సినిమా నుండి సుందర్‌ ఔట్!

- Advertisement -