రోహింగ్యా సంక్షోభం..అప్‌డేట్

6
- Advertisement -

రోహింగ్యా ముస్లింల సంక్షోభం ప్రారంభమై దాదాపు పది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ, వారి పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మానవీయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మరియు వారికి రక్షణ కల్పించడానికి ప్రపంచ దేశాలు తక్షణమే అంతర్జాతీయంగా ఉమ్మడి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

2017లో మాయాన్మార్‌లో ప్రారంభమైన హింసాకాండ కారణంగా లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లాల్సి వచ్చిందని ఐరాస గుర్తుచేసింది.

బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లో లక్షలాది మంది ఇప్పటికీ అత్యంత దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారని, వారికి ఆహారం, వైద్యం మరియు నివాస వసతులు కల్పించడం రోజురోజుకూ భారంగా మారుతోందని పేర్కొన్నారు.రోహింగ్యాలకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించడానికి నిధుల కొరత తీవ్రంగా ఉందనడానికి గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read:అమెజాన్,స్విగ్గీకి షాక్‌!

మాయాన్మార్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించి రోహింగ్యాలు గౌరవప్రదంగా మరియు సురక్షితంగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లే వాతావరణాన్ని కల్పించడానికి అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ప్రాంతీయ దేశాలు చొరవ చూపాలని ఐరాస చీఫ్ పిలుపునిచ్చారు.

- Advertisement -