పార్లమెంట్‌లో కొట్టుకున్న ఎంపీలు..

7
- Advertisement -

ఇటలీ పార్లమెంట్‌లో కొట్టుకున్నారు ఎంపీలు. ఓ బిల్లు విషయంలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా ఓ ఎంపీకి గాయాలు అయినట్లు సమాచారం. ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది. ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

దీంతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుని కొట్టుకోగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఇటలీలో జీ7 శిఖరాగ్ర సదస్సు జరుగుతుండగా ఎంపీలు కొట్టుకున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఇటలీ ఐక్యతను దెబ్బతీస్తుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:శ్రీవారిని దర్శించుకున్న ఆర్ఆర్ఆర్..

- Advertisement -