వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా మార్చి 28న(ఇవాళ) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. నితిన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ కీలక పాత్రను పోషించాడు. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్ షోలు పడిపోయాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.
సినిమా ఎలా ఉంది ? డేవిడ్ భాయ్ ఎలా నటించాడు అన్న విషయాలను తెలియజేస్తున్నారు. నితిన్, రాజేంద్రప్రసాద్, వెన్నెలకిషోర్ కాంబోలో కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ ఆఖరిలో నవ్వులు పూయిస్తోందని పేర్కొన్నాడు. మొత్తంగా రాబిన్ హుడ్‌తో నితిన్ హిట్ కొట్టాడని కామెంట్ చేస్తున్నారు.
#Robinhood
Bagundhi
2nd half >>>> 1st half
David Bhai entry ki theaters resound aeee
Comedy bagundhi
Songs placement worst except adhi dha suprise song.
Overall ga good film— NAvANeETh (@Navaneethkittu) March 28, 2025
Also Read:రామ్ చరణ్‌కు పవన్ సర్‌ప్రైజ్