- Advertisement -
ఏపీలో ‘రాబిన్‌హుడ్’ సినిమా టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ టికెట్‌పై రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ. 75 పెంపుకు అనుమతించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రను పోషించిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే తెలంగాణలో మాత్రం టికెట్ రేట్ల పెంపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఏపీలో మాత్రం టికెట్ ధరల పెంపుకు ఓకే చెప్పడం చిత్ర యూనిట్‌కు కాస్త ఊరట లభించిన అంశమని చెప్పాలి.
Also Read:ఎమ్మెల్యేల ఫిరాయింపు..ఏప్రిల్ 2కు వాయిదా
- Advertisement -