టీమండియా మాజీ డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బెస్ట్ కెప్టెన్ అని కితాబిచ్చాడు భారత మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప. ఐపీఎల్‌లో కోల్ కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో గంభీర్ కెప్టెన్సీని దగ్గరండి గమనించానని అందుకే గంభీరే తన ఫేవరెట్ కెప్టెన్ స్పష్టం చేశాడు.
మైదానంలో గంభీర్ ఎక్కువగా మాట్లాడడు. కానీ.. ఎవరికి.. ఎంత వరకూ చెప్పాలో అంతే చెప్తాడు. గంభీర్ లాంటి మంచి కెప్టెన్ ఉంటే..? టీమ్‌లోనూ నువ్వు ఎలాంటి అభద్రతా భావానికి లోనవ్వాల్సిన అవసరం ఉండదని తెలిపాడు ఊతప్ప. ఐపీఎల్‌లో గంభీర్ కెప్టెన్సీలో కోల్ కతా 2012, 2014లో విజేతగా నిలిచిందని గుర్తుచేశాడు.
2014 ఐపీఎల్ సీజన్‌లో 138 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 660 పరుగులు చేసిన ఊతప్ప.. ఆ ఏడాది కోల్‌కతా టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకూ 177 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్ 4,411 పరుగులు చేయగా.. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.