ట్రంప్ సోదరుడు రాబర్ట్ ట్రంప్‌ కన్నుమూత…

294
robert trump
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోదరుడు రాబర్ట్‌ ట్రంప్ కన్నుమూశారు. అనారోగ్యంతో న్యూయార్క్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాబర్ట్ ట్రంప్ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 72 ఏళ్లు.

1948లో జన్మించిన రాబర్ట్‌ ట్రంప్‌…..డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి నలుగురి సోదరులలో ఒకరు. ప్రస్తుతం ఆయన ట్రంప్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నారు.

నా అద్భుత సోదరుడు రాబర్ట్ శాంతియుతంగా ఈ రాత్రి కన్నుమూశాడు. అతను నా సోదరుడు మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు. అతడి జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి. ఐ లవ్ యూ రాబర్ట్ అని పేర్కొన్నారు డోనాల్డ్ ట్రంప్.

- Advertisement -