సిగ్నల్స్‌ ట్యాంపరింగ్‌..దారి దోపిడి

226
Yeshwantpur Express
- Advertisement -

సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి బెంగళూరు నుంచి కాచిగూడ వస్తున్న యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో దారి దోపిడి చేశారు దుండగులు. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో ఐదుగురు ప్రయాణికుల నుంచి 25 తులాల బంగారం,రూ. 10 వేల నగదును ఎత్తుకెళ్లారు.

యశ్వంత్ పూర్ రైలులో దొంగతనానికి పాల్పడింది దారి దోపిడి ముఠా పనిగా భావిస్తున్నట్లు రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఆరుగురు దొంగలు సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి చోరీకి పాల్పడ్డారని ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని చెప్పారు.

సిగ్నల్స్‌ కట్‌ చేసిన అనంతరం దాదాపు 20 నిమిషాలపాటు రైలు దివిటిపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగింది. ఈ సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు.

- Advertisement -