తాళం వేసిన ఇళ్లు, ఇళ్ల ముందు, బస్‌స్టేషన్‌లు, పార్కులు, గార్డెన్స్, కళాశాలలు, షాపులు ముందు నిలిపిన వాహనాలు చోరీకి గురయ్యాయనే ఘటనల గురించి వింటుంటాం. ఇంకా పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంధువుల్లా కలిసిపోయి దృష్టిమరల్చి దొంగతనాలకు పాల్పడుతారు కొంతమంది చోరులు. పగటి వేళల్లో కాలనీల్లో చిరువ్యాపారులు, సేల్స్ ప్రమోటర్స్‌లా పర్యటిస్తూ రెక్కి నిర్వహిస్తారు. రాత్రి వేళల్లో తాళం బద్దలు కొట్టి దొంగతనాలకు పాల్పడుతారు. పోలీసుల డ్రెస్సుల్లో వచ్చి కూడా అర్థరాత్రి దోచుకొని వెళ్తున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా టూరిస్ట్‌ల రూపంలో కూడా దొంగతనాలకు పాల్పడుతున్నారు దొంగలు. నిన్న వేకువజామున కరీంనగర్ పట్టణంలో దుండగుల చోరీ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ పుటేజీని పోలీసులు విడుదల చేశారు. 10 మంది దుండగులు ఏదో టూర్‌కు వెళ్తున్నట్లుగా బ్యాగ్స్ వేసుకుని హుందాగా, స్టైలిష్‌గా షార్ట్స్, నైట్ పాయింట్స్ వేసుకుని ఆటోలో దిగారు. కొంతమంది బయట ఉండి గమనిస్తుండగా..అందులో ఓ వ్యక్తి షోరూంలోకి చొరబడి వస్తువులు, నగదును ఎత్తుకెళ్లారు.
వీడియోలు చూడండి..