సల్మాన్‌తో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ?

233
salman prabhas movie
Prabhas to make his Bollywood debut with Salman Khan
- Advertisement -

ఒక్క సినిమాతో బాలీవుడ్ స్టార్‌ హీరోలను దెబ్బకొట్టాడు ప్రభాస్. బాహుబలి విజయంతో నేషనల్‌ ఫిగర్‌గా మారిన ప్రభాస్‌తో సినిమా చేయాలని చాలామంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారన్న సంగతి తెలిసిందే. అదేవిధంగా హిందీలో బాహుబలి రైట్స్ తీసుకున్న దర్శక నిర్మాత కరణ్ జోహర్.. ప్రభాస్ హీరోగా స్ట్రయిట్ హిందీ సినిమా తీయాలని అనుకున్నాడు. అయితే ప్రభాస్ సాహోకు కమిట్ కావడం.. అందుకోసం రీసెంట్‌గా తన లుక్‌ మార్చుకోవడం కూడా జరిగిపోయింది. తాజాగా బాలీవుడ్లో మరో వార్త హల్‌చల్ చేస్తోంది. సల్మాన్‌ ఖాన్‌.. ప్రభాస్‌ కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. ప్రముఖ దర్శకుడు రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరో పక్క బాలీవుడ్‌ దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ తాను తీయబోయే చిత్రంలో ప్రభాస్‌ని ఎంపికచేసుకోవాలని సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం. అయితేఏ విషయం అన్నది ప్రభాస్‌ కానీ సల్మాన్‌ కానీ చెప్పేదాకా వేచి చూడాల్సిందే. మరోపక్క సల్మాన్‌ ‘ట్యూబ్‌లైట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. రంజాన్‌కి ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరోవైపు భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సాహో సినిమా పూర్తవ్వడానికి ఏడు లేదా ఎనిమిది నెలల సమయం పడుతుంది. దీంతో సాహోపైనే ప్రభాస్ దృష్టిపెట్టే అవకాశం ఉంది. అంటే రాజమౌళి నిర్మించే చిత్రమైనా.. బాలీవుడ్‌లో తీసే సినిమాలోనైనా ప్రభాస్ నటించాలనుకుంటే, ఆ సినిమా కనీసం వచ్చే ఏడాది ప్రారంభం కల్లా సెట్స్ పైకి అవకాశం ఉంటుంది. మరీ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ సోలోగా చేస్తాడా.. లేదా సల్మాన్‌ ఖాన్‌తో చేస్తాడా అన్నది తేలాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

- Advertisement -