సౌదీలో ఘోర ప్రమాదం..45 మంది సజీవదహనం

8
- Advertisement -

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 45 మంది సజీవదహనం కాగా, మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన 16 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ విషాదకర ఘటనతో మల్లేపల్లి బజార్ ఘాట్‌ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్‌లోని మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన 16 మంది యాత్రికులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రమాదంలో మరణించిన వారి వివరాలు:

రహీమున్నీసా

రహమత్‌ బీ

షెహనాజ్‌ బేగం

గౌసియా బేగం

కదీర్‌ మహ్మద్

మహ్మద్‌ మౌలానా

షోయబ్‌ మహ్మద్

సోహైల్‌ మహ్మద్

మస్తాన్‌ మహ్మద్

పర్వీన్‌ బేగం

జకియా బేగం

షౌకత్ బేగం

ఫర్హీన్‌ బేగం

జహీన్‌ బేగం

మహ్మద్‌ మంజూరు

మహ్మద్‌ అలీ

ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన యాత్రికులు పెద్ద సంఖ్యలో మరణించడంపై రాష్ట్ర ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. సౌదీలో ఉన్న భారత రాయబార కార్యాలయం ద్వారా మిగతా వివరాలను సేకరిస్తున్నారు.

Also Read:UNICEF:సెలబ్రిటీ అడ్వేకట్‌గా కీర్తి

- Advertisement -