రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది టిప్పర్ లారీ. టిప్పర్ డ్రైవర్ మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 17 మంది మృతి చెందారు.
చేవెళ్ల ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించగా చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేటీఆర్, బండి సంజయ్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు నేతలు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలని కేటీఆర్, బండి సంజయ్ డిమాండ్ చేశారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరం అన్నారు.
మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అన్నారు. చేవెళ్ల ఘటనపై సెక్రటేరియట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ప్రమాద వివరాలు – అధికారుల మధ్య సమన్వయం చేయనుంది కంట్రోల్ రూమ్
ప్రమాద సమాచారం కోసం..
AS: 9912919545
SO: 9440854433
నంబర్లను సంప్రదించాలని కోరింది ప్రభుత్వం.
Also Read:రోషన్.. ‘ఛాంపియన్’

