గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

151
orr
- Advertisement -

హైదరాబాద్ గచ్చిబౌలి లో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ముగ్గురు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అమీర్ పేటలో ఓ హాస్టల్ లో ఉంటున్న అబ్దుల్ రహీం(25),M. మనసా(19),N మనసా(23) కాగా అబ్దుల్ రహీం బ్యాంక్ ఉద్యోగి,కాగా మనసాలు ఇద్దరు జూనియర్ ఆర్టిస్ట్ గా పోలీసులు గుర్తించారు.

గచ్చిబౌలి లో నివాసముంటున్న సాయి సిద్ధి(24) వద్దకు వచ్చి అందరూ కారులో లింగంపల్లి వైపుకు వస్తున్న క్రమంలో HCU డిపో వద్ద ఉన్న చెట్టు ను బలంగా డీ కొట్టారు. దీంతో కారు రెండు ముక్కలైంది. కారులో ప్రయాణిస్తున్న అబ్దుల్ రహీం(25),M. మనసా(19),N. మనసా(23) అక్కడికక్కడే మృతిచెందగా సాయి సైదులు(24) తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు.

- Advertisement -