భుజం కొరికితే సినిమా తీయలేను: ఆర్జీవీ

111
rgv
- Advertisement -

కనీసం రెండు మర్డర్లైనా జరిగితే తప్ప ఆ కథపై సినిమా తీయలేనని తెలిపారు దర్శకుడు ఆర్జీవీ. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మా ఎన్నికలపై సినిమా తీస్తారా అని ప్రశ్నించగా ఎన్నికల కోసం కన్నీళ్లు పెట్టుకోడం.. భుజాలు కొరుక్కోడం అనేది ఇంకా పెద్ద డ్రామాలన్నారు.

మా అసోసియేషన్ వ్యవహారంపైనా సినిమా చేస్తారా అని ప్రశ్నించగా కనీసం రెండు మూడు మర్డర్లు ఉంటేనే.. సినిమా చేస్తానని.. ఇలా భుజాలు కొరుక్కోడం.. జుట్టు పీక్కోవడంపై సినిమా చేయడం వేస్ట్ అన్నారు.

మా ఎన్నికల సమయంలో నటి హేమా శివబాలాజీ భుజాన్ని హేమ కొరకడంపై వర్మ ఈ సెటైర్లు వేశారు. కొరకడం వలన ఎన్ని గాట్లు పడ్డాయో నాకు తెలియదు కానీ.. మీడియా కెమెరాలను చూసే మా వాళ్ళు ఇంతటి యాక్టింగ్ చేశారని మాత్రం చెప్తానన్నారు.

- Advertisement -