శ్రీవారిని దర్శించుకున్న సంపూ..

51
sampoo

నటుడు సంపూర్ణేష్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకోగా ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు సంపూ.

ఈ నెల 20వ తేదిన “బజార్ రౌడీ” సినిమా విడుదల కానుంది. బజార్ రౌడీ మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించగా ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. సాయాజీ షిండే, కత్తి మహేష్, కరాటే కళ్యాణి, షఫీ, పృధ్వీరాజ్ మరియు నాగినీడు సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్ఎస్ ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చగా, విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. గౌతమ్ రాజు ఎడిట్ చేసారు. కేఎస్ క్రియేషన్స్ పతాకంపై సంధి రెడ్డి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అలాగే సంపూ నటించిన “క్లాలి ఫ్లవర్” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆర్ కె మలినేని దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రాన్ని మధు సుధాన క్రియేషన్స్, రాధా కృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.