బీహార్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు మరియు బహిష్కృత ఆర్జేడీ నాయకుడు తేజప్రతాప్ యాదవ్ బీహార్‌లోని మహ్నార్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సమయంలో హంగామా చోటుచేసుకుంది. తేజప్రతాప్ ప్రసంగాన్ని ఆర్జేడీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
జన్ శక్తి జనతా దళ్ అభ్యర్థి జయ్ సింగ్ రాథోర్ తరఫున ప్రచారం చేసేందుకు అక్కడికి చేరుకున్నారు తేజ్‌ప్రతాప్. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది ఆర్జేడీ కార్యకర్తలు …తేజస్వీ యాదవ్ జిందాబాద్ , “లాంతన్ ఛాప్ జిందాబాద్” అంటూ నినాదాలు మొదలుపెట్టారు.తేజప్రతాప్ హెలికాప్టర్‌లో మహ్నార్‌కు వచ్చారు. కానీ సమయం గడిచిపోవడంతో హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అందువల్ల ఆయన రోడ్డుమార్గంలోనే తన నియోజకవర్గం మహువా వైపు బయలుదేరారు. ఆ సమయంలో ఆర్జేడీ కార్యకర్తల ప్రతిఘటన మరింత పెరిగింది.
సభ సమయంలో ఎటువంటి అంతరాయం రాలేదని, కానీ సభ ముగిసిన తర్వాత ప్రజల్లో కొంతమంది దూకుడుగా ప్రవర్తించారని చెప్పారు. ఈ ఘటన లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పెరుగుతున్న రాజకీయ విభేదాల మధ్య చోటుచేసుకుంది.
తేజస్వీ నా మహువా నియోజకవర్గంలో నాపై ప్రచారం చేస్తే, నేను కూడా ఆయన రఘోపూర్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తాను అని తేజస్వి ఈ సందర్భంగా హెచ్చరించారు.
Also Read:బాల్ తాకి..యువ క్రికెటర్ మృతి

