లాలూ ప్ర‌సాద్ యాదవ్ కు బెయిల్ మంజూరు..

254
Lalu Prasad Yadav
- Advertisement -

ఐఆర్‌సీటీసీ కేసులో రైల్వే మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు పటియాల కోర్టు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేసింది. రూ. లక్ష బెయిల్ బాండ్, ఒకరి పూచీకత్తుతో బెయిల్ మంజూరైంది. మొద‌ట ఈ కేసుకు సంబంధించి కోర్టు లాలూకి ఇచ్చిన మ‌ధ్యంత‌ర బెయిల్ ను జ‌న‌వ‌రి 28వ‌ర‌కు పొడ‌గించింది. అనంత‌రం రెగ్యూల‌ర్ బెయిల్ పై జ‌న‌వ‌రి 28న తీర్పును ప్ర‌క‌టిస్తామ‌ని కోర్టు తెలిపింది. అయితే మ‌ధ్యాహ్నాం మ‌రోసారి విచారించిన కోర్టు లాలుకు రెగ్యూల‌ర్ బెయిల్ ఇచ్చేందుకు అంగీక‌రించింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న లాలూ భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లకు న్యాయస్థానం ఇప్పటికే సీబీఐ కేసులో రెగ్యులర్ బెయిల్‌ను, ఈడీ కేసులో మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఆర్‌సిటిసి హోటళ్ల నిర్వహణకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని, హోటళ్ల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపిస్తూ సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసింది.

- Advertisement -