- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్.జె.సునీత ఈరోజు జూబ్లీహిల్స్ జిఎచెంసి పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్‌జే సునీత మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో మరోసారి పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం ముక్కు అవినాష్ ఫ్యామిలీ, కళ్యాణమస్తు మూవీ టీంకి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు ఆర్‌జే సునీత.
- Advertisement -