టీమిండియా ఆటగాళ్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. హార్థిక్ పాండ్యా, మునాఫ్ పటేల్‌తో పాటు, బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్‌శుక్లాపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిందో మహిళ. ముగ్గురు తనపైన లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు చేసిన మహిళ అండర్‌వాల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు రియాజ్ భాటీ భార్య. మహారాష్ట్రలోని వీఐపీలంతా రియాజ్‌కు సుపరిచుతులే. రియాజ్‌పై ఇప్పుడతని భార్య రెహ్నూమా భాటీ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త రియాజే బలవంతంగా తనను వీఐపీల దగ్గరకు పంపించాడని ఫిర్యాదులో పేర్కొంది. ముంబై ట్రైడెంట్ హోటల్లో హార్థిక్ పాండ్యా, అతని ఇద్దరు స్నేహితులు, కాంటినెంటల్ హోటళ్లో మునాఫ్ పటేల్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది.
బీసీసీఐ మాజీ చీఫ్ రాజీవ్‌శుక్లా, అతని స్నేహితులు లైంగిక దాడిచేయడంతో పాటు, చిత్రవధకు గురి చేశారని ఆమె పోలీసులకిచ్చిన కంప్లైంట్లో తెలిపింది.