మంచు మనోజ్ హీరోగా నటించిన ”నేను మీకు తెలుసా” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హాట్ భామ రియా సేన్.. కొద్ది రోజుల కిందట రహస్యంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్ శివమ్ తివారీలు ప్రేమించుకుంటున్నారు. డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే అంతలోనే ఎవరికి తెలియకుండా కుటుంబసభ్యుల మధ్య ఓ హోటల్‌లో పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తరువాత రియా సేన్, తమ హనీమూన్ కోసం ప్రేగ్ ను ఎంచుకుంది. భర్తతో కలసి చెక్ రిపబ్లిక్ లోని ప్రేగ్ లో ఆనందంగా గడుపుతున్న రియా, తన మధుర క్షణాలను ఇన్‌స్టాగ్రాంలో పంచుకుంది. ఇక ఓ హోటల్ లో వీరిద్దరూ కూర్చున్న వేళ, భర్త పెదవులను ప్రేమగా అందుకున్న రియా సేన్, ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయగా, ‘నో… డోంట్ కిస్ హిమ్’ , ఇలాంటి ఫోటోలు షేర్ చేయకు రియా అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు . కాగా, రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి కారణం మాత్రం రియా గర్భవతి అవ్వడమని తెలిసింది.
https://www.instagram.com/p/BY5LrRwADXW/
ఇక ”విష కన్య” (1991) సినిమాతో బాలీవుడ్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత తెలుగు, మలయాళం, తమిళ, బెంగాలీ సినిమాల్లో నటించింది. ఆమె సోదరి రైమా తెలుగులో నితిన్ హీరోగా నటించిన ‘ధైర్యం’లో తళుక్కుమన్న సంగతి విదితమే.