రైజింగ్ లుక్స్ లో రెజీనా

56
- Advertisement -

రెజీనా కాసాండ్రా.. అందంలోనూ అభినయంలోనూ సమానమైన ప్రతిభ చూపించే ముద్దుగుమ్మల్లో ఈ చెన్నై ముద్దుగుమ్మ కూడా ఒకరు. కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ షోస్ జోలికి పోకుండా… పెర్ఫార్మెన్స్ తోనే రెజీనా కాసాండ్రా ప్రేక్షకుల మనసు దోచుకుంటూ వచ్చింది. మదర్ ల్యాండ్ కోలీవుడ్ లో లిమిటెడ్ గానే సినిమాలు చేసినా.. తెలుగులో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బెస్ట్ పెర్ఫార్మర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, రెజీనా కాసాండ్రా కు కాలం కలిసి రాలేదు. మెయిన్ హీరోయిన్ గా ఎక్కువ ఛాన్స్ లు రాలేదు.

కొంతకాలంగా… రెజీనా కాసాండ్రా టాలీవుడ్ లోనూ, కోలీవుడ్ లోనూ చిన్న సినిమాలకు మరియు సెకండ్ హీరోయిన్ రోల్స్ కే పరిమితమైంది. దీనికి కారణం ఒకే ఒక్కటి. ఆమె తన రెమ్యునరేషన్నీ భారీగా పెంచేయడమే. నిజానికి గ్లామరస్ బొద్దుగుమ్మల్ని నిర్మాతలు బాగానే ఆదరిస్తారు. రెజీనా కాసాండ్రా కి ఈ క్వాలిఫికేషన్ ఉన్నా సరే.. ఆమె గ్లామర్ ను ఒలికించదు కాబట్టి ఆమె పై ఆసక్తి చూపించలేదు అరవ నిర్మాతలు. మొత్తమ్మీద రెజీనా కాసాండ్రా పెర్ఫార్మర్ గానే మిగిలిపోయింది. తెలుగులోనూ కూడా ఇదే కారణంతో రెజీనా కాసాండ్రా బాగా వెనుకబడింది.

అలాంటి రెజీనా కాసాండ్రా.. ఇప్పుడు పూర్తిగా తన స్వరూపాన్నే మార్చేసుకుంది. అందరూ షాకయ్యే స్లిమ్ మేకోవర్ తో మెరిసిపోతుంది. ఇది వరకటి రెజీనా కాసాండ్రా కి, ఇప్పటి రెజీనా కాసాండ్రా కి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. లేటెస్ట్ గా రెజీనా కాసాండ్రా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. బాగా సన్నగా చక్కని ఫిజిక్ తో రెజీనా కాసాండ్రా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. రెజీనా కాసాండ్రా ఫోటోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ గా మారాయి. ఈ అవతారంలోనే ఆమె ప్రస్తుతం కమిట్ అయిన సినిమాల్లో కనిపిస్తుంది. కాబట్టి.. రెజీనా కాసాండ్రా కి ఈ సారి భారీగా డిమాండ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. చూడాలి మరి, రెజీనా కాసాండ్రా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో !!

ఇవి కూడా చదవండి…

ఇవి రాకపోతే అవి చేస్తోందట!

ఆమిర్‌పై సెటైర్‌ వేసిన కంగనా..

శివరాజ్‌కుమార్‌ మెచ్చిన రైటర్ చిత్రం

- Advertisement -