దీపావళి వేడుకల్లో బ్రిటన్ ప్రధాని..

8
- Advertisement -

దీపావళి సంబరాలు మొదలయ్యాయి. లండన్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. లండన్‌లోని భారతీయులు నిర్వహించిన ఈ వేడుకల్లో సతీసమేతంగా హాజరయ్యారు రిషి. దీపావళి వేడుకలకు ముందు డౌనింగ్ స్ట్రీట్ హిందూ కమ్యూనిటీ నిర్వహించిన కార్యక్రమంలో రిషి సునక్ పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన రిషి..చెడుపై మంచి సాధించిన విజయమని.. చీకటి నుంచి కాంతిలోకి పయనించే వేడుక అని పేర్కొన్నారు. అంతకముందు రిషి సునక్ తన సతీమణి అక్షతా మూర్తితో కలిసి దీపం వెలిగించి దీపావళి వేడుకలను ప్రారంభించారు. యూకేతోపాటు ప్రపంచవ్యాప్తంగా దీపావళి వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి.

Also Read:ఎలక్షన్ ఫైట్.. వారసుల పోరు?

- Advertisement -