బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ తాజాగా వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరదలితో అసభ్యంగా ప్రవర్తిండం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ వివాహ విందుకు రిషి తన భార్య నీతూ కపూర్‌తో కలిసి హాజరయ్యారు.
ఈ వేడుకలో రిషి..సల్మాన్ ఖాన్ మరదలు సీమా ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించారట. పార్టీకి వచ్చిన సల్మాన్ తనను సరిగ్గా పలకరించకుండా తోటి నటులతో కలిసి డ్యాన్సులు చేస్తున్నారన్న కారణంతో రిషి ఇలా చేశారని బాలీవుడ్ వర్గాల సమాచారం.
దాంతో సీమా తన పట్ల జరిగిన అవమానాన్ని సల్మాన్‌తో చెప్పిందట. సీరియస్ అయిన కండలవీరుడు.. రిషీతో మాట్లాడేందుకు వెళ్లారట. కానీ అప్పటికే రిషీ వేడుక నుంచి వెళ్లిపోయారట. సీమా పట్ల రిషీ ప్రవర్తించిన తీరు ఆయన భార్య నీతూ దృష్టికి రావడంతో ఆమె సీమాకు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పారట. ఏది ఏమైనా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు రిషీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నటుడు అయి ఉండి మహిళ పట్ల ఇలా ప్రవర్తించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.