- Advertisement -
ఒక్కరోజులోనే సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రియ ప్రకాశ్ వారియర్ ఏంజ్ రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. మొన్నటివరకూ కేవలం యూత్, సగటు ఆడియెన్స్ మాత్రమే ప్రియా పై ప్రశంసలు కురిపిస్తుండగా..సినీ స్టార్స్‌కూడా ఈ కెరళకుట్టీని తెగ పొగిడేస్తున్నారు.
ఓ మలయాళ చిత్రంలో నటించిన ప్రియా హావభావాలకు యూత్ ఫిదా అయినట్టే.. సినీ సెలబ్రిటీలు కూడా వైరల్ క్యూటీకి ఫిదా అయిపోతున్నారు.
తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ కూడా ప్రియకు ఫిదా అయ్యాడు. దీనిపై సోషల్ మీడియాలో స్పందించిన రిషి కపూర్.. “ఈ అమ్మాయి భవిష్యత్‌లో మంచి స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంటుంది. చూడటానికి అమాయకంగా ఉన్నా.. చాలా భావాలు పలికిస్తుంది.
మై డియర్ ప్రియ నీ ఏజ్ గ్రూప్‌లో ఉన్న వారందరు నీ కోసం పరితపిస్తారు. నేను హీరోగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రాలేదు?” అంటూ కామెంట్ పెట్టాడు రిషి కపూర్.
- Advertisement -