‘తొలిప్రేమ’ తొలివారం కలెక్షన్స్‌..

245
Tholi Prema First Week Collections
- Advertisement -

మెగా హీరో వ‌రుణ్ తేజ్, రాశీఖ‌న్నా కాంబినేష‌న్‌లో రొమాంటిక్ డ్రామాగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘తొలిప్రేమ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా రిలీజైన సినిమాల్లో అత్యంత అప్లాజ్ తెచ్చుకున్న సినిమా ‘తొలి ప్రేమ’నే. ఫిబ్రవరి 10న రిలీజైన ఈ చిత్రానికి అటు విమర్శకుల నుంచి.. ఇటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. వీకెండ్లోనే కాక ఆ తర్వాత కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో దూసుకెళ్లింది.

Tholi Prema First Week Collections

ఈ చిత్రం తొలి వారంలో రూ.17.5 కోట్ల షేర్.. రూ.32 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడం విశేషం. వరుణ్ తేజ్ కెరీర్లోనే తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రమిది. ఈ సినిమా పలు ప్రాంతాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు రూ.కోట్లలో.. నైజాం-5.40, సీడెడ్‌-1.70, నెల్లూరు-0.43, గుంటూరు -1.14, కృష్ణా 1.07, వెస్ట్-0.93, ఈస్ట్-1.18, ఉత్తరాంధ్ర 2.15, కర్ణాటక 1.20, అమెరికా 2.30, ఇతర ప్రాంతాల్లో 0.80 వ‌చ్చాయి. మొత్తానికి తొలి వారంలో ‘తొలిప్రేమ’ 18.33 కోట్ల రూపాయ‌ల షేర్ రాబ‌ట్టింది.

కాగా, ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే తొలిప్రేమ తొలి వారం షేర్‌ 17.05 కోట్ల రూపాయలుగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం గ్రాస్‌ రూ.32 కోట్లు. ‘ఫిదా’ సినిమాతో హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్న వ‌రుణ్ తేజ్.. ఆ సినిమా త‌రువాత న‌టించిన‌ ఈ ‘తొలిప్రేమ’ సినిమాను బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మించారు. తమన్‌ సంగీతాన్ని అందించాడు.

- Advertisement -