బాలీవుడ్ బ్యూటీతో రిషబ్ పంత్ డేటింగ్‌..!

375
panth

మరో భారత యువ క్రికెటర్‌ బాలీవుడ్‌ భామతో ప్రేమలో పడిన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరా.. అని ఆలోచిస్తున్నార.. ఆదేనండి టీమిండియా వికేట్‌ కీపర్‌ రిషబ్ పంత్. హీరోయిన్‌ ఊర్వశీ రౌతెలాతో పంత్ ప్రేమ వ్యవహారం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడవ టీ-20 మ్యాచ్‌కి ముందు రోజు పంత్, ఊర్వశీ జంట ముంబైలోని ఓ స్టార్ హోటల్‌కు కలిసి రావడంతో, వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారన్న లవ్ అఫైర్ నడుస్తోందని వార్తలు గుప్పుమన్నాయి.

urvasirautela

అయితే ఈ అమ్మడు అప్పట్లో హార్దిక్ పాండ్యాతో చెట్టపట్టాలేసుకుని తిరిగినట్లు వినిపించింది.. ఇప్పుడు పంత్‌తో జత కట్టిందని నెటిజన్లు అంటున్నారు. ఇక పంత్‌పై విమర్శలూ వస్తున్నాయి. అయితే ధోనీ అంతటి వాడిగా ఎదగాల్సిన పంత్, ఇటీవలి కాలంలో నిలకడ లేక, పేలవమైన షాట్లు ఆడుతూ, జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితికి చేరాడని,అందుకు ఇలాంటి డేటింగ్ లే కారణమని అభిప్రాయపడుతున్నారు. గురువారం జరిగిన చివరి టీ20లో తన ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరడం కూడా ఇలాంటి డేటింగ్‌లే కారణమంటూ నెటిజన్లు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.