‘లాయ‌ర్ సాబ్‌’గా పవన్‌ రీ ఎంట్రీ..?

343
pawan

బాలీవుడ్‌లో అమితాబ్ బ‌చ్చ‌న్‌, తాప్సీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించిన చిత్రం పింక్. ఈ చిత్రం 2016 విడుదలై సంచలనం సృషించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా పలు బాషలలో రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి రీమేక్‌గా త‌మిళంలో నెర్కొండ పార్వాయి అనే టైటిల్‌తో చిత్రం రూపొందింది. ఇక టాలీవుడ్‌లో కూడా ఈ రోజు ఈ రీమేక్‌ సంబంధించిన పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

కొద్ది రోజులుగా రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ పింక్ రీమేక్ చిత్రంతో మ‌ళ్ళీ వెండితెర‌పై ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది . దిల్ రాజు, బోనిక‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు దిల్ రాజు కార్యాలయంలో రికార్డింగ్ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి `లాయ‌ర్ సాబ్‌` అనే టైటిల్‌ని ప‌రిశీలుస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Pink Telugu remake