ఆసీస్‌ గడ్డపై చరిత్ర సృష్టించిన రిషబ్..

240
Rishabh Pant
- Advertisement -

సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది.167.2 ఓవర్లలో 622 పరుగుల వద్ద 7 వికెట్లు కొల్పోయి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది. భారత్ ఆటగాళ్లలో పుజారా డబుల్ సెంచరీ(193)ని మిస్ చేసుకోగా వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ సెంచరీతో రాణించాడు. ఆసీస్‌ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్‌కీపర్‌గా నిలిచాడు పంత్.

189 బంతుల్లో 159 పరుగులు చేసి పంత్ నాటౌట్‌గా నిలవగా రవీంద్రజడేజా 81 పరుగులకు ఔటయ్యాడు. జడేజా ఔటైన వెంటనే ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది భారత్.ఆసీస్ బౌలర్లలో లయన్ 4,హజల్‌వుడ్ 2,స్టార్క్ ఒక వికెట్ తీశారు.

ఆసియా బయట రెండు శతకాలు నమోదు చేసిన వికెట్ కీపర్‌ కూడా పంతే. 2018లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో రిషబ్‌ పంత్‌ 114 పరుగులు చేయగా.. ఇప్పుడు ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో పంత్‌ శతకం పూర్తి చేసుకున్నాడు.

- Advertisement -