ఒక సినిమా సూపర్‌హిట్ కాగానే కన్నడ ఇండస్ట్రీ వదిలి వేరే భాషల్లోకి వెళ్లను. నేను అలాంటి వ్యక్తిని కాను అంటూ కాంతార ఫేం రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలో కాంతార చిత్రానికి సిల్వర్ పీకాక్ అవార్డు దక్కింది.
ఈ సందర్భంగా మాట్లాడిన..కాంతార ఈ స్థాయిలో విజయం సాధించడానికి కన్నడ ప్రేక్షకులే కారణం..వారికి రుణపడి ఉంటానని తెలిపారు. అగ్ర కథానాయిక రష్మిక మందన్నను ఉద్దేశించే రిషబ్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు ట్రోలింగ్ చేశారు.
ఇది వివాదాస్పదం కావడంతో తాను ఎవరినీ ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, కన్నడ పరిశ్రమను వదిలివెళ్లనని మాత్రమే చెప్పానని తెలిపారు. రిషబ్ ప్రస్తుతం కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.
Also Read:Bigg Boss 7 Telugu:కంటెస్టెంట్స్ హార్ట్ టచింగ్ స్టోరీలు