Pant :ఐదో టెస్టుకు పంత్ దూరం

8
- Advertisement -

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యాడు రిషబ్ పంత్. నాలుగో టెస్టు మ్యాచ్‌లో రిష‌బ్ పంత్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌డు రిటైర్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో గాయంతో ఆఖ‌రి టెస్టు మ్యాచ్‌కు పంత్ దూరం అయ్యాడు.

పంత్ స్థానంలో ఎన్ జ‌గ‌దీశ‌న్‌ను ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించింది. జట్టుకు దూరమైన రిష‌బ్ పంత్ జ‌ట్టుకు ఓ సందేశం ఇచ్చాడు. ఆఖ‌రి మ్యాచ్‌లో విజ‌యం సాధించాల‌ని పిలుపునిచ్చాడు.

జ‌ట్టుకు తాను ఇచ్చే ఏకైక సందేశం ఏంటంటే.. అబ్బాయిలు మ‌నం గెలుద్దాం.. దేశం కోసం చేద్దాం అని పంత్ అన్నాడు. దేశం కోసం ఆడేట‌ప్పుడు జ‌ట్టు ఒత్తిడిలో ఉన్నా స‌రే ప్ర‌తి ఒక్క‌రూ మ‌ద్దుతు ఇచ్చారన్నాడు. ఇలాంటి స‌మ‌యంలో భావోద్వేగాల‌ను వివ‌రించ‌డం చాలా క‌ష్టమ‌ని, దేశం త‌రుపున ఆడ‌టాన్ని ఎప్పుడూ గ‌ర్వంగానే భావిస్తూ ఉంటాను అని పంత్ తెలిపాడు. నాలుగు మ్యాచ్‌లు ముగిసే స‌రికి భార‌త్ ప్ర‌స్తుతం 2-1 తేడాతో వెనుక‌బ‌డి ఉంది.

Also Read:చిరుతో బాబీ..మళ్లీ ఛాన్స్ కొట్టేశాడు!

- Advertisement -