‘శ్యామ్ సింగ రాయ్‌’ సాంగ్ ప్రోమో రిలీజ్..

94
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్‌’. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచీ ప్రేక్ష‌కుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘రైజ్ ఆఫ్ శ్యామ్’ పేరుతో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ‘శ్యామ్ సింగ రాయ్.. ఎగసిపడే అలజడివాడే.. తిరగబడే సంగ్రామం వాడే.. వెనకబడని చైతన్యం వాడే’ అంటూ ఈ పాట సాగుతోంది. నాని పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట నడిచింది. మిక్కీ జె. మేయర్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, విశాల్ దద్లాని – అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ నెల 6వ తేదీన ఈ పాటను ఫస్టు సింగిల్‌గా వదలనున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నారు.

https://youtu.be/ZuQuOSPO51M
- Advertisement -