శ్యామ్ సింగరాయ్‌…హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్

98
nani
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ యంగ్ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ రూపొందిస్తోన్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్‌’. సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఎస్‌. బోయ‌న‌ప‌ల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర్నుంచీ ప్రేక్ష‌కుల్లో దీనిపై మంచి క్రేజ్ ఏర్ప‌డింది. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు.

1970 కాలం నాటి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో హై వోల్టేజ్ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో డిసెంబర్ 24న చిత్రం విడుదల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు.

రైజ్ ఆఫ్ శ్యామ్ ఫుల్ లిరికల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. బాలీవుడ్ సింగర్ విశాల్ దద్లానీ పాడిన ఈ పాట ఉర్రూత‌లూగిస్తుంది. అరే ఎగసెగిసిపడు అలజడి వాడే శ్యామ్ సింగ రాయ్.. అరే తిరగబడిన సంగ్రామం వాడే.. అంటూ సాగిన ఈ పాట ఆకట్టుకుంటోంది.

- Advertisement -